Biggboss Season 8 | బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సీజన్ 8 స్టార్ట్ కాకముందే ఈ హౌస్ లోపలికి స్టార్ కాస్ వెళ్ళబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సీజన్ 8 కంటెస్టెంట్స్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో యాంకర్ విష్ణుప్రియతో పాటు నటి రీతూ చౌదరి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను ఈ మధ్య చాలా లావు అయ్యాను. కనీసం పది కిలోలు అయిన తగ్గాలి అనుకుంటున్నాను. బిగ్ బాస్‌కి వెళితే బరువు తగ్గుతానని నమ్మకం ఉంది. అయితే నేను వెళ్తానా లేదా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది. నాకైతే బిగ్ బాస్‌కు వెళ్లడం ఇష్టం లేదు కానీ అభిమానుల వలన వెళ్తాను అని భయం వేస్తుందంటూ విష్ణుప్రియ చెప్పుకోచ్చింది.
ఇక రీతు చౌదరి మాట్లాడుతూ.. నేను విష్ణుప్రియలాగనే చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. కానీ నేను హౌస్‌లోకి వెళతానో లేదో చెప్పలేను. సీజన్ 8 డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ రీతు చౌదరి తెలిపింది. ఇక వీరితో పాటు అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్స్‌గా ఎంపికైట్లు సమాచారం. అంతే కాకుండా మరికొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి, క్రికెటర్ అర్జున్, అబ్బాస్, నటుడు రోహిత్,ఇలా పలువురు పేర్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read..
Ration Cards | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. కొత్త రేషన్‌కార్డుల జారీపై కీలక నిర్ణయం