భోపాల్: మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (Siblings File FIR Against Parents) ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల సోదరుడితో కలిసి తమ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్, టీవీని ఎక్కువగా చూడటంపై తమను నిరంతరం తిట్టడంతోపాటు కొడుతున్నట్లు వారు ఆరోపించారు. అనంతరం ఆ ఇద్దరు పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉంటున్నారు.
కాగా, 2021 అక్టోబర్ 25న ఆ పిల్లల పేరెంట్స్‌పై జువైనల్ జస్టిస్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తల్లిదండ్రులపై నమోదైన కేసుపై జిల్లా కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వారు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పిల్లలు మొబైల్, టీవీలకు అలవాటు పడటం వల్ల ప్రతి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పిల్లలను తిట్టడం, కొన్నిసార్లు కొట్టడం చాలా సాధారణ విషయమని చెప్పారు.
మరోవైపు వాదనలు విన్న హైకోర్టు ఆ పేరెంట్స్‌కు ఊరట ఇచ్చింది. జిల్లా కోర్టులో వారి కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. ఆ తల్లిదండ్రుల తరుఫు న్యాయవాది ధర్మేంద్ర చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.