హీరోగా బిగ్‌బాస్ తెలుగు విన్నర్.. దృశ్యం దర్శకుడి కథతో సినిమా
అప్పట్లో కౌశల్ క్రేజ్ చూసి బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడతారేమో అనుకున్నారు. కానీ ఈ క్రేజ్ అంతా బిగ్‌బాస్ జరుగుతున్న అంత వరకు మాత్రమే ఉంది.

ఒక్కోసారి ఇండస్ట్రీలో ఒక్కొక్కరి టైమ్ భయంకరంగా నడుస్తుంది. ఎందుకు వాళ్లకు అంత ఫాలోయింగ్ వస్తుందో అస్సలు అర్థం కాదు. అలాంటి వ్యక్తి తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మందా. అప్పట్లో ఆయన ఫాలోయింగ్ చూసి మెంటల్ వచ్చేసేది. ముఖ్యంగా బయట కౌశల్ పేరు మీద చేసిన పాదయాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. ఆయన కోసం కౌశల్ ఆర్మీ కూడా మొదలైంది. బిగ్ బాస్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించకపోతే ఏకంగా సెట్‌ను తగలెట్టేస్తామని వార్నింగులు కూడా వచ్చాయి. నాని సినిమాలు బ్యాన్ చేస్తామంటూ కౌశల్ ఆర్మీ గోల చేసింది. అప్పట్లో ఆయన క్రేజ్ చూసి బయటికి వచ్చిన తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడతారేమో అనుకున్నారు. కానీ ఈ క్రేజ్ అంతా బిగ్‌బాస్ జరుగుతున్న అంత వరకు మాత్రమే ఉంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కౌశల్ మళ్లీ మామూలు అయిపోయాడు. అందరిలాంటి కంటెస్టెంట్‌గానే మిగిలిపోయాడు కానీ విన్నర్ అయినా కూడా పెద్దగా కలిసిరాలేదు. చేతిలో సినిమాలు కూడా ఏం లేవు.. అవకాశాలు కూడా రాలేదు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఇన్ని రోజులకు హీరోగా ఒక సినిమాను మొదలు పెట్టాడు కౌశల్.
ఏడాది కాలంగా ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు కౌశల్. దానికి కారణం ఆయన భార్యకు అనారోగ్యం రావడమే. దాంతో కొన్ని రోజులు పూర్తిగా మీడియాకు దూరంగానే ఉన్నాడు కౌశల్. ఇదే విషయం అప్పట్లో సోషల్ మీడియాలో తెలియజేశాడు ఈయన. తాజాగా ఈయన హీరోగా ఒక సినిమా మొదలైంది. దీని పేరు రైట్. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. దృశ్యం, దృశ్యం 2 లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. ఆయన కథతోనే కౌశల్ హీరో అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు హైదరాబాద్‌లోనే జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈయనకు పోస్టర్‌పై పీపుల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. మరి హీరోగా కౌశల్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ప్రస్తుతం ఆది సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు కౌశల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

