BB Telugu Grand Finale | బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటేనే సందడిగా ఉంటుంది. టాప్ సెలబ్రిటీలతో హంగామా ఉంటుంది. డ్యాన్సులు, పాటలు గట్రా ఉంటాయి. అయితే.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేను కూడా బిగ్ బాస్ బాగానే ప్లాన్ చేశాడు. కానీ.. ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచాడు. గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయినప్పటి నుంచి చివరి వరకు గెస్టులతో బాగానే బిగ్ బాస్ అలరించాడు కానీ.. చివరల్లో మాత్రం భలే ట్విస్ట్ ఇచ్చాడు. అదే ఇప్పుడు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
బిగ్ బాస్ ప్రతి సీజన్లో గ్రాండ్ ఫినాలేకు విన్నర్‌ను ప్రకటించే ముందు.. ఇద్దరు కంటెస్టెంట్లు మిగిలి ఉండగా ఎవరైనా పెద్ద స్టార్‌ను తీసుకొచ్చి వాళ్లతో బిగ్ బాస్ విన్నర్‌ను అనౌన్స్ చేయించేవారు. గత సీజన్లలో అయితే మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి బిగ్ బాస్ విన్నర్‌ను ప్రకటించారు.
కానీ.. ఈసారి మెగాస్టార్ గెస్ట్‌గా రాలేదు. ఈసారి బిగ్ బాస్ విన్నర్‌ను హోస్ట్ నాగార్జునే ప్రకటించాడు. అందరూ ఊహించినట్టుగానే వీజే సన్నీ బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ విజేతగా నిలిచాడు.
అంతకుముందు టాప్ 5 కంటెస్టెంట్లలో సిరి, మానస్, శ్రీరామ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోగా.. మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు.. షణ్ముఖ్, సన్నీని నాగార్జున బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకొచ్చాడు. ఇద్దరి చేతులను పట్టుకొని నాగార్జున స్టేజ్ మీద షణ్ముఖ్ చేతిని వదిలేసి సన్నీ చేయిని అలాగే పైన ఉంచాడు. దీంతో సన్నీ బిగ్ బాస్ 5 సీజన్ విజేత అంటూ నాగ్ ప్రకటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇట్స్ అఫీషియల్.. బిగ్ బాస్ 5 తెలుగు విజేత VJ సన్నీ..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు