ఇట్స్ అఫీషియల్.. బిగ్ బాస్ 5 తెలుగు విజేత VJ సన్నీ..

BiggBoss 5 Telugu winner VJ sunny | బిగ్ బాస్ 5 తెలుగు ముగిసింది. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో.. 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎంతో మంది అతిరథ మహారథులు వచ్చి కంటెస్టెంట్స్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే విన్నర్ ఎవరు అవుతారు అని ఆసక్తిగా తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. ఇక ముందు నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. బిగ్‌బాస్ 5 తెలుగు విజేతగా VJ సన్నీ నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంట్లోకి వచ్చిన ఈ కంటెస్టెంట్ అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బయటకు ఒకలా.. లోపల మరొకలా కాకుండా ఎమోషన్ ప్రేమ కోపం అన్ని చూపించాడు సన్నీ. దాపరికం లేకుండా అందరితోనూ అద్భుతంగా ఉన్నాడు. ఇదే ఈయనను విజయం వైపు అడుగులు వేసేలా చేసింది.

నిజానికి బిగ్‌బాస్ సగం సీజన్ అయిపోయేంత వరకు కూడా సన్నీపై ఎలాంటి అంచనాలు లేవు. అందరి ఫోకస్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ పైనే ఉంది. కానీ ఒక్కొక్క వారం గడుస్తున్న కొద్దీ తనను తాను ఇంకా మెరుగుపరుచుకుని విజేతగా నిలిచాడు సన్నీ. చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈయన. ఓటింగ్ పరంగా కూడా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్ జస్వంత్ వైపు ఉంది. విజేత సన్నీని నాగార్జున అధికారికంగా స్టేజిపై ప్రకటించాడు. స్వయంగా ఆయన ఇంటి లోపలికి వెళ్లి ఇద్దరూ ఫైనలిస్టులను బయటకు తీసుకొచ్చాడు.

సన్నీకి 50 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు బిగ్‌బాస్ ట్రోఫీ.. షాద్ నగర్లో సువర్ణభూమి వాళ్ల తరపు నుంచి 25 లక్షల ఫ్లాట్ గిఫ్ట్‌గా వచ్చింది. సన్నీ గెలవగానే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. మాజీ ఇంటి సభ్యులు కూడా చాలా మంది సన్నీ గెలవాలని కోరుకున్నారు. అదే జరగడంతో పండగ చేసుకున్నారు కంటెస్టెంట్స్. మరోవైపు షణ్ముఖ్ జస్వంత్ 105 రోజుల ప్రయాణం చేసి రన్నరప్ ట్రోఫీతో బయటకు వచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..
బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

