Bigg Boss Day 2 Promo | బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు వస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మరోసారి సందడి షురూ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ షో మొదలైంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో.. ఇప్పుడు బిగ్ బాస్ 8 తెలుగు రూపంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు నిర్వాహకులు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా ఈ షోకి సంబంధించిన డే 2 ప్రోమోను బీబీ టీం విడుదల చేసింది.
ఈ ప్రోమో చూస్తుంటే.. పట్టుకొనే ఉండండి అనే టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే షో స్టార్ట్ అయిన రెండో రోజు నుంచే బిగ్ బాస్ టాస్క్‌లు ఇచ్చి గొడవలు పెడుతున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. ఇక లావణ్య – రాజ్ తరుణ్ కేసులో సెన్సేషన్ అయిన శేఖర్ బాషా ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలిచాడు. కాగా ఈ ప్రోమోను మీరు చూసేయండి.
అంతకుముందు ఆదివారం సాయంత్రం ఈ షో ప్రారంభంకాగా.. తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది.. రెండో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నిఖిల్ వచ్చాడు అయితే ఈ ఇద్దరిని జోడీగా హౌస్‌లోకి పంపించారు నాగార్జున. ఆ తర్వాత పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ నవీన్, టీవీ నటి ప్రేరణ జోడీగా చేసి హౌస్‌లోకి పంపారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క.. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా జోడీ హౌస్‌లోకి వెళ్లారు.
తొమ్మిదో కంటెస్టెంట్‌గా బేబీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత, పదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నాగమణికంట, 11వ కంటెస్టెంట్‌గా పృథ్విరాజ్, 12వ కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని, 13వ కంటెస్టెంట్‌గా ఈటీవీ ‘ఢీ’ ఫేమ్ నైనికా, 14వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నబీల్ ఆఫ్రిది బీబీహౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. షో మధ్యలో రానా దగ్గుబాటితో పాటు ‘35 – చిన్న కథ కాదు’ హీరోయిన్ నివేదా థామస్, హీరో విశ్వదేవ్ రాచకొండ, ‘సరిపోదా శనివారం’ మూవీ హీరో నాని, హీరోయిన్ ప్రియాంక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read..