Silambarasan TR | పాపులర్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఏ రేంజ్లో క్రేజీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో బిగ్ బాష్ షోను ఇష్టపడే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇక తమిళంలో వచ్చే బిగ్ బాస్ షో (Big Boss Tamil)కు కూడా ఫాలోయింగ్ ఎక్కువే. బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఉలగనాయగన్ కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడని తెలిసిందే.
ముందుగా ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. దీంతో ఇక ఈ సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తమిళ్ కొత్త సీజన్‌కు శింబు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని తాజాగా నెట్టింట వార్తలు హల్ చేస్తున్నారు. ఈ సీజన్‌కు హోస్ట్ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తే చాలా మంది శింబు పేరే చెప్పడం విశేషం. మరి బిగ్ బాస్ మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ప్రస్తుతానికి ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానప్పటికీ తాజా అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. శింబు ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్‌లో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు STR48, STR49 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. కమల్ హాసన్ చేతిలో మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్‌తోపాటు ఇండియన్ 3, కల్కి 2898 ఏడీ సీక్వెల్, విక్రమ్ 2 ఉన్నాయి.
STR should be the automatic choice to host #BiggBossTamil as he already succeeded and got good response among people in #BiggBossUltimate.#SilambarasanTR #BiggBoss pic.twitter.com/KP0AOfOpTZ
— Balaji (@RDBalaji) August 8, 2024
Most of the Audience preferring, #SilambarasanTR as the host of this season’s BiggBoss🤝💥pic.twitter.com/6QDL1PQ3u8
— AmuthaBharathi (@CinemaWithAB) August 8, 2024
SJ Suryah | సరిపోదా శనివారంలో నాని పాత్ర ఇదే.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?