Gade Innaiah | సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టయ్యారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నందుకు ఎన్ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వెళ్లిన ఎన్ఐఏ అధికారులు.. ఆయన్ను అరెస్టు చేశారు.
ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. ఉపా (UAPA) చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.