భీమ్లానాయక్ (Bheemla Nayak) రెడీ అవుతున్నాడు..టైటిల్ ట్రాక్ తో అందరిలో జోష్ నింపేందుకు సిద్దమవుతున్నాడు. రేపు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. డైరెక్టర్ క్రిష్ (Krish)పవర్ ఆంథమ్ ను రేపు ఉదయం 11.16 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. పవన్ కల్యాణ్ బ్లాక్ షర్ట్ గళ్ల లుంగీలో చేతిలో కర్ర పట్టుకుని మాస్ టచ్ లో ఉన్న లుక్ స్టన్నింగ్ గా ఉంది.
టైటిల్ సాంగ్ మాస్, క్లాస్ ఆడియెన్స్ ను అలరించడం పక్కా అని తాజా లుక్ తో తెలిసిపోతుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో థమన్ బీజీఎంకు అద్బుతమైన స్పందన వస్తోంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్నాడు భీమ్లానాయక్. రానా దగ్గు బాటి (Rana Daggubati) కీ రోల్ పోషిస్తున్నాడు.
The POWER ANTHEM will be UNLEASHED by @DirKrish tomorrow at 11:16AM! #BheemlaNayakTitleSong
— BA Raju's Team (@baraju_SuperHit) September 1, 2021
A @MusicThaman Musical
Let's Celebrate the POWER DAY with THE BLAZING RIFLES REVERBERATION@pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @saagar_chandrak @ramjowrites @venupro pic.twitter.com/jAmkA2aBs3
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్