టాలీవుడ్ (Tollywood) హీరోలు పవన్ కల్యాణ్ (Pawankalyan), రానా (Rana) కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీమ్లానాయక్ (Bheemla Nayak). పవన్‌కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా..రానా డానియల్ డానీ శేఖర్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా లొకేషన్ నుంచి బయటకు వచ్చిన స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తాజా స్టిల్‌లో రానా, పవన్ యాక్షన్ మూడ్‌లో ఉన్నారు. నీలిరంగు చొక్కా, గళ్ల లుంగీలో ఉన్న పవన్‌కల్యాణ్ మంచంపై పడుకోగా..ఆ పక్కనే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న రానా ఎండ్ల బండిపై పడుకున్నాడు.
భీమ్లా నాయక్ షూటింగ్ లొకేషన్ నుంచి విడుదలైన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ థియేటర్లలో సందడి చేయనుంది. అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ గ్లింఫ్స్ వీడియోలకు అద్బుతమైన స్పందన వచ్చింది.
Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic @SitharaEnts pic.twitter.com/WoBlwj0Owi
— BA Raju's Team (@baraju_SuperHit) October 21, 2021
ఎస్ థమన్ కంపోజ్ చేసిన భీమ్లానాయక్ టైటిల్ ట్రాక్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ పంట పండిస్తోంది. భీమ్లానాయక్ లో నిత్యమీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత