Lenin Movie | టాలీవుడ్ యువ హీరో అక్కినేని వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ గ్రామీణ నేపథ్యంలో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. హిందీ, తమిళ సినిమాల కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త కథానాయిక పేరు వినిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ భాగ్యశ్రీ భోర్సే లెనిన్ సినిమాలో కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More