
తెలుగు సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు గుడ్న్యూస్. 2021 స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ లో తెలుగు సినిమా ‘బెంచ్’ సెమీ ఫైనలిస్టుగా నిలిచింది. స్డూడెంట్ ఆస్కార్స్ లో ఈ అరుదైన ఛాన్స్ కొట్టేసిన తొలి తెలుగు సినిమాగా బెంచ్ నిలిచింది. అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన శ్రేయాస్ చెన్నమధౌని బెంచ్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ అవార్డ్స్ కు మొత్తం 180 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 1400 సినిమాలు రాగా..బెంచ్ సెమీ ఫైనలిస్టుగా నిలిచింది.
అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని షేర్ చేస్తూ..అన్నపూర్ణ స్టూడియోస్ విద్యార్థులు ఈ ఘనత సాధించి, ఫ్యాకల్టీ గర్వంగా ఫీలయ్యేలా చేశారని ట్వీట్ చేశారు. మరోవైపు అరుదైన అవకాశాన్ని అందుకున్న బెంచ్ చిత్రయూనిట్, డైరెక్టర్ కు టాలీవుడ్ యాక్టర్స్ సుమంత్, సమంత శుభాకాంక్షలు తెలియజేశారు. స్టూడెంట్ ఫిల్మ్ మేకర్ అయిన శ్రేయాస్ పలు షార్ట్ ఫిలిమ్స్ తీశారు. కాలేజీ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్టులో భాగంగా స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
So very proud of the students who made this possible and of course the faculty of #AnnapurnaCollege #StudentsOscars https://t.co/2jDQdqPubB https://t.co/CxByw6cOsZ
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 27, 2021
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..