మక్తల్, జూన్ 13 : క్రీడలతోనే మానసికోల్లాసంతోపాటు శరీర దృఢత్వం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురసరించుకొని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం అధ్యక్షతన, శనివారం కొత్త గార్లపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన 8 జిల్లాల అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ పోటీలకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ పట్టణంలో 8 జిల్లాల బాలబాలికలకు, మహిళలకు జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. నియోజకవర్గం నుంచి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్న గోపాలంనకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పేరొన్నారు. సైక్లింగ్ పోటీలకు 8 జిల్లాల నుంచి 200 మంది బాలబాలికలు, మహిళలు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
సైకిల్ పోటీలలో గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్, మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో సైక్లింగ్ ఫెడరేషన్ అఫ్ నారాయణపేట జిల్లా చైర్మన్ మణికంఠ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మానస, ఎస్సై రేవతి, డీవైఎస్వో వెంకటేశ్ శెట్టి, నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు తాన్ సింగ్, పీడీలు విష్ణువర్ధన్‌రెడ్డి, ఈశ్వర్, మీనా కుమారి, రేణుక, విశాలి, వ్యాయామ ఉపాధ్యాయులు ఆమ్రేశ్, దామోదర్, త్రివేణి, చంద్రకళ, వెంకటేశ్, నవీన్, బాల్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.