‘ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలన్న మా ప్రయత్నం ఫలించింది. ఈ సినిమాకు విడుదలైన ప్రతీ సెంటర్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. మంచి కంటెంట్‌తో తీసిన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు’ అని అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహుగారపాటి నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. తప్పకుండా ఈ సినిమా మరో రేంజ్‌కు వెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అనుకున్న దానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తున్నదని, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆడియెన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.
ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని, ప్రేక్షకులు యునానిమస్‌గా సినిమాను హిట్ చేశారని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కూడా పాల్గొన్నారు.