Haindava | టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ యంగ్ యాక్టర్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి BSS12. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మిస్టిక్ థ్రిల్లర్‌గా వస్తుంది. ఇటీవలే బెల్లంకొండ కొండపైన అటవీ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లుక్ ఒకటి విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోనువ విడుదల చేశారు. కొండలు, అటవీ ప్రాంతం విజువల్స్‌తో మొదలైంది ట్రైలర్. ఓ వైపు ఆలయంపై ఇంధనం చల్లుతున్న సన్నివేశాలు, గర్జిస్తున్న సింహం.. మరోవైపు బెల్లంకొండ బైక్‌పై వాటిని నియంత్రించేందుకు వస్తున్న విజువల్స్‌తో గూస్బంప్స్ తెప్పించేలా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. దైవత్వంలో పాతుకుపోయిన, సాహసంతో కూడిన కథ అంటూ విడుదల చేసిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మెయిన్ హైలెట్‌గా నిలువబోతున్నట్టు విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.ఈ మూవీలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..ఇప్పటికే లాంచ్ చేసిన సంయుక్తా మీనన్ స్టైలిష్, ట్రెండీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సంయుక్తా మీనన్ ఇందులో సమీర పాత్రలో నటిస్తోంది. ఈ మూవీకి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
హైందవ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో..
Oscars 2025 | ఆస్కార్స్ 2025.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఐదు భారతీయ సినిమాలివే..!