Bobby Deol | సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ లీడ్ రోల్ పోషించిన మూవీ యానిమల్ (Animal). కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా, తృప్తి డిమ్రి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. 2023 డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ (Bobby Deol) పోషించిన అబ్రార్ హాక్ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సినిమా వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో నేను సందీప్ రెడ్డి వంగాతో మాట్లాడాను. కానీ సీక్వెల్ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రేక్షకులు సీక్వెల్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తెరకెక్కిస్తారని నమ్ముతున్నానన్నాడు.
నేను ఎప్పుడూ కలలుగన్న ఏడాదిని యానిమల్ నాకు ఇచ్చింది. నేను ఎక్కడికెళ్లినా ప్రజల నుండి ప్రేమ, ఆశీర్వాదాలను పొందుతున్నాను. 29 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాకు మరో అవకాశం వచ్చింది కాబట్టి. నా బెస్ట్ ఇవ్వాలి. యానిమల్ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. మరి సీక్వెల్ ఉంటే బాబీ డియోల్ పాత్ర ఎలా ఉండబోతుందన్నది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్