Bhairavam | బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అదితీశంకర్ కాంబోలో వస్తోన్న చిత్రం భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ వెన్నెల సాంగ్ అప్డేట్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా న్యాచురల్ స్టార్ నాని భైరవం నుంచి అందమైన ఓ వెన్నెల ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ పాట గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరో.. నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసెరో అంటూ కోనసీమ అందాల మధ్య సాగుతూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని హింట్ ఇచ్చేస్తుంది. తిరుపతి జావన రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల పాడారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
ఒక పక్క కోనసీమ అందాలు.. ఇంకో పక్క క్యూట్ లవ్ ట్రాక్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. భైరవం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మనోజ్ గజపతిగా కనిపించనుండగా.. నారా రోహిత్ వరద పాత్రలో కనిపించబోతున్నాడు.
థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ పాత్రలు మాస్ అప్పీల్‌తో ఉండబోతున్నట్టు పోస్టర్లు క్లారిటీ ఇచ్చేశాయి. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఓ వెన్నెల లిరికల్ వీడియో..
కోనసీమలో…
Oka pakka Konaseema andhaalu…
Inko pakka cute love song-u ❤️#Bhairavam shooting is going on at full pace, capturing a beautiful love song between @BSaiSreenivas & @AditiShankarofl 💥 pic.twitter.com/uXoIMgkt0C— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2024
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్