Beast Release Date | తమిళ స్టార్ హీరో దలపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘తుపాకి’ చిత్రం నుంచి ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘బీస్ట్’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రేక్షకులలో మొదటి నుంచి ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీను ప్రకటించారు.
‘బీస్ట్’ చిత్రాన్ని ఏప్రిల్13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ తరువాతి రోజే ‘కేజీఎఫ్ చాప్టర్-2’ విడుదల కానుంది. ఈ చిత్రం గురించి సౌత్ టూ నార్త్ ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలున్నాయి. ఈ క్రమంలో బీస్ట్ చిత్రాన్ని విడుదల తేదీపై నెటీజన్లు పలురకాల కామెంట్స్ వేస్తున్నారు. విజయ్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుత్తూ’ సాంగ్ యూట్యూబ్‌లో 21కోట్ల మంది వీక్షించారు. సౌత్‌లోనే ఫాస్టెస్ట్ వ్యూవుడ్ లిరికల్ సాంగ్‌గా అరబిక్ కుత్తూ రికార్డు సృష్టించింది. లేటెస్ట్గా విడుదలైన ‘జాలీ ఓ జుంఖానా’ సాంగ్ కూడా రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు.. ఏషియన్ నారంగ్, సురేష్ బాబుతో కలిసి రిలీజ్ చేస్తున్నాడు. విజయ్ తన తదుపరి సినిమాను వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
#beast 💥💥#BeastFromApril13 https://t.co/rd3Lrc3BEq
— Nelson Dilipkumar (@Nelsondilpkumar) March 22, 2022
ఇవి కూడా చదవండి:
Radhe Shyam | ‘రాధేశ్యామ్’ మరో రికార్డు.. రూ.400కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ?
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ డైరెక్టర్‌కు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు?
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Ram Charan-Shankar | మరోసారి రామ్‌చరణ్‌కు విలన్‌గా.. ఆ సీనియర్ స్టార్ హీరో?