Radhe Shyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మర్చి 11న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా లవర్‌బాయ్ పాత్రలో నటించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం కనీస స్థాయిలో కలెక్షన్లను కూడా సాధించలేపోయింది. దానికి తోడు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఘన విజయం సాధించడంతో ‘రాధేశ్యామ్’ కలెక్సన్లకు తీవ్ర స్థాయిలో దెబ్బపడింది. తాజాగా ఈ చిత్రం 400కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం లేటెస్ట్గా రూ.204కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దీనితో పాటుగా డిజిటల్, శాటిలైట్ హక్కులు కలుపుకొని రూ.400 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని సమాచారం. ముందుగా అనుకున్న తేదీకంటే ఈ చిత్రం పది రోజుల మందుగానే డిజిటల్లోకి రానుంది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 11 తర్వాత స్ట్రీమింగ్ చేయాలని యూవీ సంస్థ, అమేజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో అమేజాన్ భారీ డీల్‌తో పది రోజుల ముందే సినిమాను విడుదల చేయాలని యూవీతో సంప్రదింపులు జరిపింది. ఆ చర్చలు సఫలం అవడంతో రాధేశ్యామ్ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 2 నుంచి అమేజాన్‌లో స్ట్రీమింగ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఇవి కూడా చదవండి:
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Project-k movie | నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని మహాభారతం నుంచి స్పూర్తి తీసుకున్నాడా?
Mohan Babu | రెండు జతల బట్టలతో.. కారు షెడ్డులో ఉన్నాను :మోహన్‌బాబు
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?