Mohan Babu | విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షన నటనను కనబరుస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు మొహన్‌బాబు. అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న వేరియేషన్స్‌ను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఆదివారం ఈయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలను వెల్లడించాడు.
‘నా జీవితం కష్టాలమయం. ఏదో సాధించాలనే పట్టుదలతో చిత్తూరు నుంచి మద్రాసు వెళ్లాను. నటుడిని కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. దాదాపు ఏడెళ్లు తిండి లేక వేసుకోవడానికి చెప్పుల్లేక, రెండు జతల బట్టలతో, కారు షెడ్డులో ఉంటూ చెప్పలేనన్ని ఇబ్బందులు పడ్డాను. ఎంతోమంది రాజకీయ నాయకులు నాతో ప్రచారం చేయించుకున్నారు, కానీ వాళ్ల సాయం నాకు ఎప్పటికీ ఉండదు. నేను వాళ్లను సాయం కూడా అడగను. జీవితం నాకు ఎన్నోగుణపాఠాలను నేర్పింది’ అని చెప్పుకొచ్చాడు.
లేటెస్ట్గా ఈయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు. ప్రస్తుతం ఈయన ‘శాకుంతలం’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన సమంత ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది.
ఇవి కూడా చదవండి:
Raashi Khanna | రాశీఖన్నా మొదట నటిని అవ్వాలని అనుకోలేదట..
Penny Song | ‘పెన్నీ’ ఫుల్ సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?