గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 13, 2020 , 09:35:05

బాల‌య్య‌-బోయపాటి చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి

బాల‌య్య‌-బోయపాటి చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి

బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ ద్వ‌యం హ్యాట్రిక్‌పై క‌న్నేసింది. తొలి షెడ్యూల్ వార‌ణాశిలో జ‌ర‌గ‌గా, రీసెంట్‌గా ఈ షెడ్యూల్ పూర్తి చేశారు. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ని తొలి షెడ్యూల్‌లో జ‌రిపిన‌ట్టు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలిపారు. త‌ర్వాతి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌నున్న‌ట్టు ఓ ప్ర‌చారం జ‌ర‌గ‌గా, ఇందులో ఎంత నిజ‌ముంద‌నే దానిపై క్లారిటీ లేదు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అచ్చ తెలుగు భామ అంజలిని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. గతంలో అంజలి.. బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’లో కథానాయికగా నటించింది. ఇక విల‌న్‌గా శ్రీకాంత్ అనుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించిన శ్రీకాంత్.. నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ సినిమాలో విలన్‌గా మెరిసాడు. ఇపుడు బోయపాటి శ్రీను చిత్రంలో మరోసారి పూర్తిస్థాయి విలన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. 


logo