Unstoppable-2 | ‘అన్‌స్టాపబుల్-2’ ట్రైలర్ వచ్చేసింది.. గూస్బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య స్టంట్స్..!
Unstoppable-2 Trailer | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అన్‌స్టాపబుల్' రెండో సీజన్ రానే వచ్చింది. తాజాగా ఆహా రెండో సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్లో బాలయ్య డైలాగ్స్, స్టంట్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
Unstoppable-2 Trailer | నటసింహం సందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో అభిమానులే కాదు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేశాడు. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలకృష్ణ.. ఏకంగా టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రెటీలతో బాలయ్య బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ షోతో బాలయ్య ఎంత సరదా మనిషి అని చాలా మందికి తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండో సీజన్ రానే వచ్చింది. తాజాగా రెండో సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఆహా సంస్థ విడుదల చేసింది.
‘అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూడ నిధి అన్ మ్యాచెబుల్, అక్కడ ఎదురయ్యే సవాళ్ళు అన్ ప్రెడిక్టెబుల్, అయినా ఆగని మనం పోరాటం అన్‌స్టాపబుల్, గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్. ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్..మీకోసం మరింత రంజుగా అన్‌స్టాపబుల్-2’ అంటూ బాలయ్య డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. చివర్లో దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అంటూ వచ్చే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ ట్రైలర్ ట్రెజర్ హంట్ నేపథ్యంలో కత్తి కోసం బాలయ్య ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నాడు అని చూపించారు.
రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ సారి అల్లు అరవింద్ ఇంకాస్త గ్రాండియర్‌గా రెండో సీజన్‌ను రూపొందినట్లు తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్‌ను అ! మూవీ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.
ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం… మరింత రంజుగా…Season 2 streaming from October 14th, every Friday on aha!
దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!#UNSTOPPABLEWITHNBKS2 #NandamuriBalakrishna #ahaVideoIN #NBKOnAHA @PrasanthVarma @anudeepdev pic.twitter.com/jizLxWQzUK
— ahavideoin (@ahavideoIN) October 9, 2022
Read Also:
Sardar Movie | కార్తి ‘సర్దార్’ ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Suriya | సీక్వెల్‌కు సిద్ధమవుతున్న సూర్య బ్లాక్‌బస్టర్ మూవీ?
Kantara Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ?
Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

