Sardar Movie | కార్తి ‘సర్దార్’ ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Sardar First Single | తమిళ హీరో కార్తి వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'విరుమన్' విడుదలై ఘన విజయం సాధించింది. కార్తి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే 'విరుమన్' తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కార్తి ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో 'సర్దార్' ఒకటి.
Sardar First Single | తమిళ హీరో కార్తి వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘విరుమన్’ విడుదలై ఘన విజయం సాధించింది. కార్తి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవలే ‘విరుమన్’ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కార్తి ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘సర్దార్’ ఒకటి. ‘అభిమన్యుడు’ ఫేం పీఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ‘సేనాధిపతి నేనే’ అంటూ సాగే పాటను సోమవారం సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో కార్తి కిరీటం ధరించి మెడలో పూలమాలతో విభిన్న గెటప్‌లో ఉన్నాడు. జీవి ప్రకాష్ ఈ చిత్రానికి స్వరకర్తగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తి డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడీయోస్ సంస్థ విడుదల చేస్తుంది.
https://twitter.com/AnnapurnaStdios/status/1578983927381118976?s=20&t=cy-7j1s3CmcB7nHvDGF43A
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

