Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
Vikram Vedha Movie Enter's 100 Crore Club | బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'విక్రమ్ వేద'. తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన పుష్కర్- గాయత్రి హందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించారు.
Vikram Vedha Movie Enter’s 100 Crore Club | బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్ వేద’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన పుష్కర్- గాయత్రి హందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో హృతిక్, సైఫ్ అలీఖాన్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత హృతిక్ సినిమా రావడంతో అభిమానులు థియేటర్లకు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓ మైల్‌స్టోన్‌ను సాధించింది.
విక్రమ్ వేద చిత్రం లేటెస్ట్గా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి సుమారుగా రూ.175 కోట్ల వరకు బడ్జెట్ అయింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.180 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న జోరులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది. విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో హృతిక్.. వేద పాత్రలో గ్యాంగ్‌స్టార్‌గా నటించగా, సైఫ్ ఆలీఖాన్.. విక్రమ్ పాత్రలో పోలీస్ ఆఫిసర్‌గా నటించాడు. ఈ రీమేక్ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించింది.
Read Also:
Kantara Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ?
Salaar | ప్రభాస్ అభిమానులకు క్రేజీ న్యూస్.. ‘సలార్’ టీజర్ వచ్చేది అప్పుడేనట?
Vijay DevaraKonda | యూత్ ఐకాన్‌గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ..!
Prabhas | రీ-రీలీజ్‌కు రెడీ అవుతున్న ప్రభాస్ ఫ్లాప్ మూవీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

