Salaar Movie Teaser | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘కేజీఎఫ్-2’ ఘన విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు. ఈ విషయంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు టాక్. కాగా సలార్ టీజర్ గ్లింప్స్‌ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో తండ్రి, కొడుకులుగా నటించనున్నట్లు టాక్. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభాస్‌ను యానిమేషన్లో చూపిస్తారా అంటూ దర్శకుడిపై అభిమానులు తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే తాజాగా ఈ టీజర్‌ను ౩డీలో విడుదల చేయగా.. మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. రామాయణం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also:
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో విజయ్-లోకేష్ మూవీ.. ‘LCU’లో భాగంగానే ‘Thalapathy67’ తెరకెక్కనుందా?
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
పవర్ఫుల్ పాత్రలో ఇంద్రసేన.. దసరా కానుకగా శాసనసభ మూవీ పోస్టర్ రిలీజ్