Karthikeya-2 Movie OTT Record | ఈ ఏడాది ఇండియాలోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ‘కార్తికేయ-2’ ఒకటి. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అగస్టు 13న విడుదలై సంచలన విజయం సాధించింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. కేవలం విడుదలైన ౩ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. పోటీగా ‘రక్షాబంధన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలున్నా.. వాటిని సైతం పక్కకి నెట్టెసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం దాదాపు రూ.120 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది.
ఇక ఈ చిత్రం దసరా కానుకగా బుధవారం నుండి జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే 100కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టిస్తుంది. జీ-5లో ఫాస్టెస్ట్ 100కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సాధించిన సినిమాగా కార్తికేయ-2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మిస్టరీ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు చందూ ముండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. ఇక ప్రస్తుతం కార్తికేయ-3 చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయిట. వీలైనంత త్వరగానే పార్ట్-3 షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Read Also:
Varun Tej | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ పోస్టర్..!
Waltair Veerayya | చిరు అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘మెగా 154’ టీజర్ వచ్చేది అప్పుడేనట..!
రీమేక్‌కు సిద్ధమైన మరో మలయాళ మూవీ.. హక్కులను కొనుగోలు చేసిన స్టార్ హీరో
NTR30 | ఎన్టీఆర్-కొరటాలశివ మూవీ క్రేజీ అప్డేట్.. నందమూరి అభిమానులకు పండగే..!