Indrasena in Sasanasabha Movie | చిరంజీవి సైరా, రామ్‌చరణ్ ధృవ సినిమాలతో గుర్తింపు పొందిన నటుడు ఇంద్రసేన. గతంలో పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఇంద్రసేన.. ఇప్పుడు శాసనసభ అనే పాన్ ఇండియన్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ లుక్‌ను దసరా పర్వదినాన విడుదల చేసింది చిత్ర బృందం.
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవి బసుర్.. ఇంద్రసేన సినిమాకు సంగీతం అందించాడు. ఐశ్వర్యరాజ్ ఈ సినిమాలో కథానాయిక. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
We Team #Sasanasabha are wishing Happy Vijayadashami to all now time for introduce powerful leading man The Dynamic Hero #Indrasena as surya @ravibasrur @sapbroproductions #aishwaryarajbhakuni #RajendraPrasad #VenuMadikanti #ShanmugamSappani pic.twitter.com/fk9YkcN6Xq
— Maduri Mattaiah (@madurimadhu1) October 5, 2022
ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని మీడియాకు తెలియజేశారు. ఇది పొలిటికల్ థ్రిల్లర్. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బసుర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ పిల్లర్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో కథానాయకుడు ఇంద్రసేన పాత్ర ఎంతో విభిన్నంగా, డైనమిక్‌గా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచే విధంగా ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.
“Ravi Basrur | ‘శాసన సభ’కు మ్యాజిక్ చేయబోతున్న’కేజీఎఫ్’ కంపోజర్”