Prabhas Movie Re-Release | ఈ మధ్య టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా వాళ్ళ పాత సినిమాలను 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలు వాళ్ళ బర్త్‌డే సందర్భంగా విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రీ-రిలీజ్ ప్రభాస్ వంతుకు వచ్చింది. అక్టోబర్23 న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈయన నటించిన ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి అనూహ్యంగా ప్రభాస్ బర్త్‌డేకు వారం రోజుల ముందే మరో సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు.
ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా తమన్నా, దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. రెబల్ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘డార్లింగ్’, ‘Mr. పర్ఫెక్ట్’ వంటి వరుస హిట్లతో స్పీడ్ మీదున్న ప్రభాస్‌కు రెబల్ మూవీ బ్రేకులు వేసింది. అయితే ఇప్పటికి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లను అభిమానులున్నారు. లారెన్స్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా, సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. అయితే దీనిపై పలువురు నెటీజన్లు మాత్రం ‘రెబల్’ సినిమాను రిలీజ్ చేసే బదులు ‘బుజ్జిగాడు’ సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:
Salaar | ప్రభాస్ అభిమానులకు క్రేజీ న్యూస్.. ‘సలార్’ టీజర్ వచ్చేది అప్పుడేనట?
Vijay DevaraKonda | యూత్ ఐకాన్‌గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ..!
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో విజయ్-లోకేష్ మూవీ.. ‘LCU’లో భాగంగానే ‘Thalapathy67’ తెరకెక్కనుందా?
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?