Unstoppable With NBK season 4 | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK)కున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్ 4లో భాగంగా ఇప్పటికే ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడుతో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు రెండో ఎపిసోడ్ టైం వచ్చేసింది.
తాజాగా లక్కీ భాస్కర్ ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి (Meenakshi Chowdary) ఎపిసోడ్ 2లో ప్రత్యక్షమయ్యారు. దుల్కర్ సల్మాన్, బాలకృష్ణ, వెంకీ అట్లూరి సరదా చిట్‌చాట్, ఆటతో పేల్తాయ్.. అన్నీ పేల్తాయ్.. అంటూ సాగుతున్న ప్రోమో ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 31న దీపావళి కానుకగా రాత్రి 7 గంటలకు ప్రీమియర్ కానుంది.
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 2 ప్రోమో..
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తోన్న దుల్కర్ సల్మాన్.. నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ ట్రైలర్ వాయిస్ ఓవర్ ఇస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
పేల్తాయ్….అన్నీ పేల్తాయ్!💥
Ee Diwali Special ‘Lucky Baskhar tho mana NBK!!🤩
Unstoppable season 4 ఇది బాలయ్య పండుగ..😀Watch Promo▶️https://t.co/FjcVN3QUpz#Unstoppables4 with NBK Season 4, Episode 2 premieres on Oct 31, 7:00 PM.@ahavideoIN #DulqarSaalman… pic.twitter.com/BLVWfv1ezA
— BA Raju’s Team (@baraju_SuperHit) October 29, 2024
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..