Chiranjeevi | ఏపీ అసెంబ్లీ ( AP Assembly) సమావేశాల్లో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( MLA Balakrishna) చేసిన సినీ పహాట్ టాపిక్‌గా మారాయని తెలిసిందే. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో మాట్లాడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని , సీఎంను ఎవరెవరు కలువాలో జాబితాను తయారు చేశారని అక్కడ జరిగిన పరిణామాలను వివరించారు. జగన్ నివాసం వద్ద సినీ ప్రముఖుల కారును భద్రత సిబ్బంది ఆపివేశారని తెలిపారు.
అనంతరం సీఎంకు బదులు నాటి సినిమాటోగ్రఫి మంత్రి చర్చలు జరుపుతారని సమాచారం వచ్చిందని అన్నారు. దీంతో చిరంజీవి గట్టిగా అభ్యంతరం తెలుపడంతో జగన్‌తో సమావేశం జరిగిందని వెల్లడించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ నాడు సైకో జగన్ వద్ద జరిగిన సమావేశంలో గట్టిగా ఎవ్వరూ మాట్లాడలేదన్నారు. తయారు చేసిన జాబితాలో తన పేరును 9వ పేరుగా ఎవరు వేశారో సమాధానం ఇవ్వాలని ప్రస్తుత సినిమాటోగ్రఫి మంత్రి దుర్గేష్‌ను బాలకృష్ణ కోరారు.
కాగా అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై చిరంజీవి స్పందించాడు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లా. నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్‌కు వివరించా. సమయం వస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను. కోవిడ్ వల్ల ఐదుగురే రావాలని చెప్పారు. 10 మంది వస్తామంటే జగన్ సరేనన్నారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు.నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను వివరణ ఇస్తున్నానన్నాడు చిరంజీవి.
They Call Him OG | ఓజీలో నేహాశెట్టి స్పెషల్ సాంగ్ కట్.. ఇంతకీ ఎందుకు తీసేశారో మరి..?
Jatadhara | గూస్బంప్స్ తెప్పించేలా సుధీర్ బాబు సోల్ ఆఫ్ జటాధర ట్రాక్
Dhadak 2 | ఓటీటీలోకి ‘ధడక్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!