They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంచగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.
ఓజీ కోసం డీజే టిల్లు భామ నేహాశెట్టిపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారని తెలిసిందే. ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో నేహాశెట్టి స్వయంగా వెల్లడించింది. అయితే ఓజీ ఫైనల్ కట్లో మాత్రం స్పెషల్ సాంగ్ మిస్సయింది. ఇంతకీ ఈ పాటను పెట్టకపోవడం వెనుకున్న కారణమేంటనేది తెలియాల్సి ఉండగా.. దీనికి సంబంధించిన మరో కథనం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓజీ 2 కూడా ఉండబోతుందని సినిమా ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్.
నేహా శెట్టిపై వచ్చే పాటను సీక్వెల్ కోసం రిజర్వ్ చేసి ఉంచారన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?