Dhadak 2 | బాలీవుడ్ నుంచి వచ్చి హిట్ అందుకున్న క్రేజీ సీక్వెల్ ధడక్ (Dhadak) 2. ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi), యానిమల్ భామ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ప్రధాన పాత్రల్లో నటించగా.. షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ చిత్రం నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) విధి (త్రిప్తి డిమ్రీ) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. నిలేష్ అనే అణగారిన కులానికి చెందిన యువకుడు లా చదువుదామని న్యాయ కళాశాలలో జాయిన్ అవ్వగా.. అతడికి విధి అనే ఉన్నత కులానికి చెందిన యువతి పరిచయమవుతుంది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారాగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
Do duniya. Do dil. Aur bas ek dhadak ❤️
Watch Dhadak 2, out tomorrow on Netflix. #Dhadak2OnNetflix pic.twitter.com/DPwjpGnDI0— Netflix India (@NetflixIndia) September 25, 2025