’మా‘ ఎన్నికలు టాలీవుడ్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ’మా‘ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలకృష్ణ తన మద్దతు విష్ణుకే అని ప్రకటించారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఆయన ’అఖండ‘ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే బాలయ్యను విష్ణు కలిశారు.
తన ఆలోచనలను బాలకృష్ణకు వివరించిన విష్ణు మద్దతివ్వాలని కోరారు. దీనికి ఆయన సరేనన్నారు. తన మద్దతు విష్ణు ప్యానెల్‌కే అని ప్రకటించారు. బాలకృష్ణ తమకు మద్దతివ్వడం గర్వంగా ఉందని విష్ణు చెప్పారు. ఇదిలా వుండగా, ప్రకాశ్ రాజ్ కూడా తన ప్యానెల్ ప్రచారంలో జోరు పెంచారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో నటీనటులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తన ప్రణాళికను అందరికీ వివరించారు. ’లంచ్ మీటింగ్‘ పేరుతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.