Akhanda 2 Teaser | నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2(Akhanda 2). బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే జూన్ 10 బాలయ్య బర్త్‌డే కానుకగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు, 5.90 లక్షలకు పైగా లైక్‌లను సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతపై చిత్ర నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అఖండ 2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Read More