She Teams | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఇంటి యజమానికి 73 ఏండ్లు… తన ఇంట్లో కిరాయికి ఉన్న వారితో కలివిడిగా ఉంటాడు…. ఇంట్లో అందరు ఉన్నప్పుడు రాముడిలా…బాలిక ఉన్నప్పుడు మాత్రం రక్షసుడిగా మారిపోతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు…అతని పిచ్చిచేష్టలపై తల్లిదండ్రులకు చెప్పినా… అతడు రాముడంటూ బాలికపైనే కసురుకునేవారు.. ఇలా మూడేండ్లుగా ఆ ఇంటి య జమాని వేధిస్తుండడంతో..
బాలిక అతడి చేష్టలను ఒక రోజు సెల్ఫోన్లో రహస్యం గా రికార్డు చేసి తల్లిదండ్రులకు చూపించడంతో… రాచకొండ షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ వృద్ధుడిని పోలీసులు అరె స్ట్ చేశారు. ఇలా మహిళలు, యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలు, క్రిమినల్స్‌ను ఆయా కేసుల తీవ్రతను బట్టి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ.. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. గత నెలలో పట్టుబడ్డ పోకిరీలకు మంగళవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయం లో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూ ళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీల్లో తిరుగుతూ షీ టీమ్స్ సిబ్బంది డెకాయి ఆపరేషన్ చేస్తున్నారని తెలిపారు. బాలికలు, మహిళలు, యువతులను వేధించే పోకిరీలను ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదని , మహిళలు నిర్భయంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
పట్టుబడ్డ పోకిరీలను వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి మాట్లాడుతూ.. గత నెలలో పట్టుబడిన 240 మందిలో 160 మంది మేజర్లు, 80 మంది మైనర్లు ఉన్నట్లు తెలిపారు. గత నెలలో షీ టీమ్స్‌కు 288 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫోన్ల ద్వారా వేధింపులు 42, సోషల్‌మీడియా యాప్స్ ద్వారా 102, నేరుగా వేధింపులకు సంబంధించిన కేసుల ఫిర్యాదులు 144, అందులో 18 క్రిమినల్ కేసులు, 122 పెట్టీ కేసులు, 110 మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీసీపీ వివరించారు.
ప్రేమించకపోయిన ఫర్వాలేదు..
ఓ యువతి క్రికెట్ శిక్షణ పొందుతుంది. అదే శిక్షణ సంస్థలో ఉన్న యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానం టూ చెప్పగా.. అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. నీవు ప్రేమించకపోయిన పర్వాలేదు.. ఓయో రూమ్‌కి రా.. ! లేకుంటే.. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు.. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో కేసు నమో దు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
బ్లాక్‌మెయిలింగ్..
బాలికకు ఆన్లైన్లో లూడో అ డుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ప రిచయమై ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలు తెలుసుకొని మెసేజ్ పెడుతున్నాడు. నీ వీడియోలు, ఫొటోలు నా వద్ద ఉ న్నాయంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.