Akhanda 2 | టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం (నేడు) రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సినిమాను ముందే చూడొచ్చనుకునే మూవీ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 ప్రీమియర్ షోలు నిలిపేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని ట్వీట్ చేసిన 14 రీల్స్ సంస్థ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.
ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫస్ట్ పార్టుకు మించిన స్కోర్ సీక్వెల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#Akhanda2 Premieres in India scheduled for today are cancelled due to technical issues.
We’ve tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.
The overseas premieres will play as per the schedule today.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?