Akhanda 2 | టాలీవుడ్ సినీ జనాలతోపాటు వరల్డ్‌వైడ్‌గా తెలుగు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) క్రేజీ కాంబోలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండకు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రోజులు లెక్కపెట్టుకుంటున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి షేర్ చేశారు మేకర్స్.
అఖండ 2 అనుకున్న సమయానికి రావడం లేదు. అవును మీరు చదివింది.. విన్నది నిజమే. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ సెప్టెంబర్ 25న విడుదలవుతుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో పోటీ ఉండొద్దనే బోయపాటి టీం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని నెట్టింట చర్చ నడుస్తుండగా.. దీనిపై అధికారికంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుగా నిలుస్తోంది అఖండ 2. విడుదలైన అన్ని భాషల్లో టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టీజర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం మరింత సమయం కావాల్సి ఉంది. రీరికార్డింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం టీం నిరంతరం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. ఫస్ట్ పార్టును మించిన సక్సెస్ అందుకునేలా సినిమాను రెడీ చేసేందుకు విడుదల తేదీని మారుస్తున్నాం. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు.
ప్రేక్షకుల ఎదురుచూపులకు సరిపడే వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నామని సుదీర్ఘ సందేశాన్ని మూవీ లవర్స్, అభిమానులతో షేర్ చేసుకున్నారు మేకర్స్. అఖండ 2 రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#Akhanda2 – AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025
Param Sundari | ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్.. లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న సిద్ధార్థ్, జాన్వీ
lakshmi menon | ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట