Anushka Shetty | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల అనుష్క ఈ మధ్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో అనుష్క ఘాటి అనే చిత్రం చేయగా, ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా, గంజాయి మాఫియా నేపథ్యంలో నడుస్తూ, అనుష్కను ఓ శక్తివంతమైన గిరిజన మహిళ పాత్రలో చూపించనుంది.
మూవీ ట్రైలర్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనుష్క అదిరిపోయే గెటప్‌తో ప్రేక్షకులను అలరించగా, ఫ్యాన్స్ ఫుల్ హైప్లో ఉన్నారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొనకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఘాటి టీం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నా, అనుష్క ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై ఓ ఎక్స్ పోస్టులో చిత్ర నిర్మాత స్పందిస్తూ, “అనుష్క ప్రమోషన్లలో పాల్గొనబోనని షూటింగ్‌కు ముందే స్పష్టంగా తెలిపింది. ఆ మేరకు ఒప్పందం కుదిరింది” అని చెప్పారు. అయితే అనుష్క ఎందుకు ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటోంది? అనే అంశంపై టాలీవుడ్ వర్గాల్లో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలా? లేక ఇతర సినిమాల కమిట్మెంట్సా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఆమె అభిమానులు మాత్రం కొంత నిరాశలో ఉన్నారు.
అనుష్క హాజరు లేకపోయినా, ఘాటి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఫస్ట్ లుక్ నుంచే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సినిమా డిజిటల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుందన్న వార్తలు వస్తున్నాయి. ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అయినా అనుష్క హాజరవుతుందా? అన్నది ప్రస్తుతం ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ‘ఘాటి’ సినిమా షూటింగ్ వరకు మాత్రమే అనుష్క కమిటైందని, ప్రమోషన్, సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలకు ఆమె హాజరుకాదనేది నిజమని కొందరు చెప్పుకొస్తున్నారు.