lakshmi menon | ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట
Tamil Actress | కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
lakshmi menon | కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట లభించింది. కేరళ కోర్టు సెప్టెంబర్ 17 వరకూ నటికి ముందస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది. అప్పటి వరకూ ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు సూచించింది.
అసలేం జరిగిందంటే.. గత ఆదివారం కొచ్చిలోని ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ గ్యాంగ్‌కి, ఐటీ ఉద్యోగినికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు ఐటీ ఉద్యోగిని వెంబడించి, అతడి కారును అడ్డగించారు. ఆ తర్వాత అతడిని బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని సమాచారం. అయితే దీనిపై కేసును నమోదు చేసిన ఎర్నాకులం నార్త్ పోలీసులు నటి స్నేహితులైన మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి లక్ష్మీ మీనన్ కోసం ప్రస్తుతం పరారీలో ఉందని ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అయితే నటి పేరును ఇంకా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చలేదని సమాచారం.
లక్ష్మీ మీనన్ ప్రధానంగా తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. ఆమె నటించిన చిత్రాలలో కుమ్కి (Kumki), సుందరపాండియన్ (Sundarapandian), జిగర్తాండ (Jigarthanda), వేదాలం (Vedalam), చంద్రముఖి 2 (Chandramukhi 2) వంటి తదితర చిత్రలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. విశాల్ నటించిన ఇంద్రుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

