Param Sundari | బాలీవుడ్ యువ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరం సుందరి’ (Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ చిత్రంలో సిద్ధార్థ్ పంజాబీ అబ్బాయిగా, జాన్వీ కపూర్ కేరళ యువతిగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్(Param Sundari Promotions) నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం అయిన లాల్బాగ్చా రాజాను దర్శించుకుంది ఈ జంట. గణేశ్ చతుర్థి ఉత్సవాల వేళ లాల్బాగ్చా రాజాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వేడుకలలో జాన్వీ సంప్రదాయబద్ధంగా ఎర్రటి పైఠానీ చీరలో మెరిసిపోగా.. సిద్ధార్థ్ మల్హోత్రా పింక్ రంగు కుర్తాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
#SidharthMalhotra and #JanhviKapoor pay a visit to #LalbaugchaRaja ahead of #ParamSundari’s release.#GaneshChaturthi #Celebs pic.twitter.com/jm8fhNGgo2
— Filmfare (@filmfare) August 28, 2025