Balagam | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ బ్యానర్లో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడు వేణు డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్చిత్రం ‘బలగం’ (Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో గత ఏడాది విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలంగాణలోని ప్రతి పల్లె చూసిందంటే ప్రేక్షకులు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని దిల్ రాజ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహయ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ లిరిక్స్, ఉత్తమ సహయ నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్( మేల్, ఫిమేల్) కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఇక అవార్డు ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫిల్మ్ ఫేర్ ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.
#Balagam proves that when good cinema is made…..the accolades never stop pouring in 🙏🏻
Another achievement! Nominated in 8 categories for the 2024 @Filmfare Awards!@PriyadarshiPN @VenuYeldandi9 @KavyaKalyanram @dopvenu @LyricsShyam @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy… pic.twitter.com/hl80Tp6v7Q
— Sri Venkateswara Creations (@SVC_official) July 17, 2024
Also Read..