Kriti Sanon | రీచెస్ట్ ప్లేస్‌లో కాస్ట్లీ ప్రాపర్టీ కొన్న కృతి సనన్
Kriti Sanon | సినీతారల తళుకులు కెరీర్ పీక్‌లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు.
Kriti Sanon | సినీతారల తళుకులు కెరీర్ పీక్‌లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఎంత పెట్టుబడి పెడుతున్నామనే దానికంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామన్నదే ముఖ్యం.
‘భూమిపై పెట్టుబడి ఎప్పటికైనా లాభదాయకమే’ అనేది చాలామంది ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. అదే బాటలో పయనిస్తున్నారు సినీతారలు. బాలీవుడ్, టాలీవుడ్ తేడాలేకుండా చాలామంది నటీనటులు భూములు కొనుగోలు చేస్తూ స్థిరాస్తులను పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ భామ కృతీ సనన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. సౌత్ ముంబయిలోనే ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఆలీబాగ్ టౌన్లో 2,000 స్క్వేర్ ఫీట్ ప్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
‘అందమైన డెవలప్మెంట్ అయిన సోల్ డే ఆలీబాగ్‌లోని ద హౌజ్ ఆఫ్ అభినందన్ లోధాలో నేను కూడా ఒక గర్వమైన, సంతోషకరమైన ల్యాండ్ ఓనర్ అయ్యాను. భూమి కొనడం అనేది చాలా పెద్ద నిర్ణయం. నేను గత కొన్నాళ్లుగా ఆలీబాగ్‌లో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. ఇటీవల బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇదే టౌన్లో 10,000 చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేయడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

