Sarpanch | నువ్వు గెలిచేందుకు పెట్టుబడి పెట్టాం.. మేం చెప్పినట్లే వినాలి.. సర్పంచ్‌లకు బడా లీడర్ల హుకుం
Sarpanch | కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్‌లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, వ్యాపారులు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుండగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
Sarpanch | మంచిర్యాల, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్‌లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, వ్యాపారులు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుండగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
పెత్తనమంతా రియల్టర్లదే..
గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు చేసిన వాగ్ధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఏం చేయాలన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అవసరమైతే పార్టీ మారేందుకు కొందరు సర్పంచ్‌లు సిద్ధం అవుతున్నారు. మా పార్టీలో చేరిన వారికి రూ.5 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వడంతోపాటు గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామన్న అధికార పార్టీ ఆఫర్ ఓ వైపు ఎలాగూ ఉంది. దీంతో కొందరు కొత్త సర్పంచ్‌లు ఆ దిశగా ఆలోచనలు చేస్తుంటే.. మరికొందరు కొత్త సర్పంచ్‌లు ఏం చేయలేక మిన్నకుండిపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో కొందరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫండింగ్ చేశారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని బడా నాయకులు పెట్టుబడి పెట్టారు. దీంతో పేరుకే నువ్వు సర్పంచ్, మేం ఏం చెబితే అదే చేయాలి. ఎందుకంటే నువ్వు గెలిచేందుకు మేం ఖర్చు పెట్టుకున్నామంటూ వ్యాపారులు, బడా లీడర్లు హు కుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏం చేయలేక సర్పంచ్ అన్న పేరుకే పరిమితం కావాల్సి వస్తుందంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 మందికి ఓ రియల్ సంస్థ పెట్టుబడి..
మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఓ మండలంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడి పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. ఆ సంస్థకు సంబంధించి వెంచర్లు ఉన్న దాదాపు 10 గ్రామాల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్‌లను గెలిపించుకుంది. రానున్న రోజుల్లో ఆ సంస్థ చేసే ఇల్లీగల్ దందాకు ఎలాంటి అడ్డం లేకుండా, గ్రామ సర్పంచ్‌లను మచ్చిక చేసుకునే అవసరం లేకుండా.. సర్పంచ్‌లుగా తమకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించుకున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా తన ఇల్లీగల్ వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఆ సంస్థ నిమగ్నమైంది. ఇప్పుడు ఆ సర్పంచ్‌ల్లో కొందరు వేరే పార్టీల్లోకి వెళ్తామంటే దానికి సదరు సంస్థ ఒప్పుకోవడం లేదని సమాచారం.
మేం చెప్పే దాక వెయిట్ చేయాలని, మేం ఏం పార్టీలో చేరమంటే ఆ పార్టీలోనే చేరాలంటూ హుకుం జారీ చేసినట్లు వినికిడి. ఇక గ్రామాల్లో పలుకుబడి ఉన్న కొందరు బడా లీడర్లు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో పోటీ చేయలేదు. దీంతో వారు తమ అనుచరులను బరిలోకి దించారు. వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. ఇలా కొన్ని చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పుడు తమ ప్రోద్భలంతో గెలిచిన సర్పంచ్‌లను చేతిలో పెట్టుకొని పదవుల కోసం కొందరు సదరు లీడర్లు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి గ్రామాల్లో సర్పంచ్ కన్నా కూడా ఆయన వెనుకున్న పెద్ద లీడర్లే పెత్తనం చెలాయించనున్నారు. గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో ఇప్పుడు ఈ చర్చ జోరుగా సాగుతున్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

