న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కార్ల ధరల పెంపు వాహనాల జాబితాలోకి తాజాగా హోండా కార్స్ ఇండియా కూడా చేరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వీటిలో హోండా సిటీ, అమేజ్, ఎలివేట్ మాడళ్లు ఉన్నాయి.
ఉత్పత్తి వ్యయం పెరుగడంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా స్వల్పంగా వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.