Mirai 2 |హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja) మిరాయి (Mirai) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతున్నాడని తెలిసిందే. ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
కాగా మిరాయి సినిమా ఎండింగ్లో ప్రేక్షకులకు వారు ఊహించని మరో సూపర్ సర్ప్రైజ్ కనిపిస్తుందని తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలియజేస్తూ మేకర్స్ సినిమా ముగింపు సమయంలో ఓ స్పెషల్ సీన్ ద్వారా హింట్ ఇచ్చారు. సీక్వెల్ టైటిల్ మిరాయి : జైత్రయా అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. కాగా మిరాయి నెక్ట్స్ చాఫ్టర్ యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో ఉండబోతున్నట్టు ఈ సీన్ ద్వారా తెలుస్తోంది. కాగా మిరాయి 2కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సీక్వెల్ పార్టులో టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందులో రానా మెయిన్ విలన్‌గా కనిపిస్తాడని.. రానా పాత్ర ఇదివరకెన్నడూ లేని విధంగా అందరినీ సర్ప్రైజ్ చేసేలా స్టన్నింగ్‌గా ఉండబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దీనిపై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏం లేకున్నా.. ఇదే నిజమైతే సీక్వెల్ పార్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Bigg Boss 9 | బిగ్ బాస్ 9లో ఫస్ట్ ఎలిమినేషన్.. శ్రష్టి వర్మ ఔట్… కారణాలేంటో తెలుసా?
Karisma Kapoor | మూడు రోజులు 47 టేక్‌లు: ‘రాజా హిందుస్థానీ’ ముద్దు సీన్‌పై స్పందించిన కరిష్మా కపూర్
Sai Durga Tej | లవ్ ట్రాక్ బయటపెట్టిన సాయి తేజ్.. 2023లో బ్రేకప్ అంటూ కామెంట్