Bigg Boss 9 | బిగ్ బాస్ 9లో ఫస్ట్ ఎలిమినేషన్.. శ్రష్టి వర్మ ఔట్… కారణాలేంటో తెలుసా?
Bigg Boss 9 | పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్ లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా, మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్‌కి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
Bigg Boss 9 | పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్ లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా, మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్‌కి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ వారం నామినేషన్స్‌లో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఇలా 9 మంది ఉన్నారు. శనివారం ఎపిసోడ్లో తనూజ సేఫ్ అయ్యారు. ఇక ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్లో శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు పంపనున్నట్టు సమాచారం.
ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే శ్రష్టి వర్మ తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తుంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్‌మేట్స్‌తో సరిగ్గా మెలగడం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్‌లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్క వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన శ్రష్టికి రెండు లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు రూ. 28,571 చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ సీజన్ ప్రారంభమైనప్పటినుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించని విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందు ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కాని ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

