Urvashi Rautela | బాలీవుడ్ నటి ఊశ్వరి రౌటెలా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఆలయ అర్చకులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పేరిట ఉత్తర భారతంలోనూ ఓ ఆలయం ఉందని.. దక్షిణాదిలో సైతం అభిమానులు గుడి కట్టాలని కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. అయితే, బ్యూటీ క్వీన్పై ఊర్వశి వ్యాఖ్యలపై పూజారులు మండిపడుతున్నారు. నటి చేసిన వ్యాఖ్యలు అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని భువన్ చంద్ర ఉనియాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బద్రీనాథ్ సమీపంలో బామ్నిలో ఊరశ్వి పేరుతో ఆలయం ఉందని.. కానీ, ఈ ఆలయంతో నటికి ఎలాంటి సంబంధం లేది.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమ మత విశ్వాసాలను అగౌరవ పరచడమేనని బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ ధ్వజమెత్తారు. బామ్నిలో ఉన్న ఊర్వశి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని.. సతీదేవితో ఈ ఆలయం ముడిపడి ఉందని.. మరో వ్యక్తికి సంబంధం లేదన్నారు. ధక్షయజ్ఞం సమయంలో అవమానం భరించలేక సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ధక్షుడిని అంతం చేసి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలు దేరుతాడు.
శివుడి ఆవేధన తీర్చడం కోసం తన చక్రాయుధంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అ ఖండిత భాగాలు వేర్వేరు ప్రదేశాల్లో పడిపోయాయి. అమ్మవారి శరీర భాగాలు పడిపోయిన క్షేత్రాలుగా మారాయి. భారత్లో మొత్తం 108 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం కూడా అందులో ఒకటి అని తెలిపారు. నటి తన పేరుతో ఆలయం ఉందని చెప్పుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. నటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ చార్దామ్ తీర్థ పురోహిత్ మహాపంచాయత్ నటి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే కోర్టులో కేసు వేయనున్నట్లు మహా పంచాయత్ హెచ్చరించింది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊరశ్వి మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో తన పేరుతో ఆలయం ఉందని.. బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉన్న ఊర్వశి టెంపుల్ నా కోసమే కట్టారని.. టాలీవుడ్లో తనకూ ఎంతో మంది అభిమానులు ఉన్నారని.. ఉత్తరాది తరహాలోనే తనకూ ఆలయం కట్టాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యనించింది. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊర్వశి రౌటెలా తెలుగులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో స్పెషల్ సాంగ్లో కనిపించింది. ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద మూవీల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇటీవల బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలో కీలకపాత్రలో నటించింది.