Baby Hindi Remake | సాయిరాజేశ్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బేబి. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అవ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నట్టు డైరెక్టర్ సాయిరాజేశ్ ప్రకటించాడని తెలిసిందే. అయితే రీమేక్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది.
దివంగత బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ బేబీ హిందీ రీమేక్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే బాబిల్ ఖాన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరయ్యాడట. కానీ అనుకున్న సమయానికి రీమేక్ సెట్స్ రాకపోవడంతో బాబిల్ ఖాన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు బీటౌన్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బేబీ రీమేక్ అటెకెక్కినట్టేనని పుకార్లు షికారు చేశాయి. అయితే ఇటీవలే ఈ పుకార్లపై సాయి రాజేశ్ స్పందిస్తూ రీమేక్ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి కానున్నట్టు చెప్పాడు. రీమేక్ 2026 ఫస్ట్ హాఫ్‌లో విడుదలయ్యే అవకాశముందన్నాడు సాయి రాజేశ్.
ఎక్స్‌లో కొన్ని వర్గాల ప్రేక్షకుల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. జనాలు సినిమా చాలా లైక్ చేశారు. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. హిందీ వెర్షన్లో కొన్ని మార్పులు చేశాం. తెలుగు వెర్షన్లో రివ్యూయర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా హిందీ వెర్షన్లో కొన్ని తప్పులను సరిచేశామంటూ చెప్పుకొచ్చాడు. సాయి రాజేశ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో బేబీ రీమేక్ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉందని.. కొంత ఆలస్యమైనా ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని అర్థమవుతోంది.
Ghaati Day 1 | అనుష్క ‘ఘాటి’ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే.!
Prabhas | డార్లింగ్ అభిమానులకు మాస్ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Unmukt Chand | క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవితంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్!