Baa Baa Black Sheep | తెలుగులో సందడి చేయబోతున్న క్రైం కామెడీ జోనర్ సినిమా బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep). న్యూ ఏజ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని గుణి మంచికంటి డైరెక్ట్ చేస్తున్నాడు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మేఘాలయలో ఉంది మూవీ టీం. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు నిర్మాత వేణు దోనెపూడి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. సినిమా మొత్తం ఇక్కడే షూట్ చేశాం. మేఘాలయలో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుని తొలి సినిమా ఇది. కథ, కథనం డిమాండ్ మేరకు ఎన్నో ప్రదేశాల అన్వేషణ తర్వాత ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, వాటర్ ఫాల్స్, పర్వతాలు, థ్రిల్లింగ్, ఎక్జయిటింగ్ లొకేషన్లున్న మేఘాలయను ఎంపిక చేసుకున్నామన్నారు.
ప్రస్తుతం మూవీ టీం దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే తూర్పు ఖాసీ హిల్స్‌లోని (సోహ్రా)చిరపుంజిలో ఉంది. కాగా చిరపుంజి భారీ వర్షంలో షూటింగ్ చేయడం చాలా చాలెంజింగ్‌గా అనిపించిందన్నారు వేణు దోనెపూడి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన లైటింగ్‌తో కెమెరా రోల్లో చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ అద్భుతంగా పనిచేసిన మా టీంకు అభినందనలు. విజువల్స్ ప్రేక్షకులకు ఖచ్చితంగా ట్రీట్ అందించేలా ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు.
తమకు అద్భుతమైన మద్దతు ఇచ్చి సినిమా షూటింగ్‌కు సహకరించిన మేఘాలయ ప్రభుత్వానికి వేణు దోనెపూడి టీం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బా బా బ్లాక్‌షీప్ బృందం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మాను కలిసి ధన్యవాదాలు తెలియజేసింది. అందమైన మేఘాలయ మాయాజాలంతో, సినిమా షూటింగ్ మరపురాని ప్రయాణంగా మారుతోంది. త్వరలో మీ ముందుకు వస్తున్న ఒక ఆపలేని సరదా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.. అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Team #BaaBaaBlackSheep met the Chief Minister of Meghalaya, Shri Conrad K. Sangma, and thanked him for the incredible support.
With Meghalaya’s scenic magic all around, the film’s shoot is turning out to be an unforgettable journey. ✨
Get ready for an unstoppable fun ride… pic.twitter.com/IIzuWc3Uir
— Chitralayam Studios (@ChitralayamOffl) November 8, 2025
K Ramp Movie | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Rajinikanth | 50 ఏళ్ల సినీ కెరీర్.. రజనీకాంత్‌ను సన్మానించనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
Ajay Bhupathi | ‘మంగళవారం’ దర్శకుడి కొత్త ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ రేపే.!