టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ (Ayyappanum Koshiyum Remake) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి పోలీసాఫీసర్ గా నటిస్తున్న పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ లుక్ ఇప్పటికే విడుదలవగా అద్బుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ అందించారు. పవన్ పుట్టినరోజుకు ముందే అభిమానులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్.
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఉదయం 9.45 గంటలకు సర్ ప్రైజ్ ఉండబోతుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ బ్లాక్ ఫుల్ షర్ట్, లుంగీలో నడుచుకుంటూ వెళ్తున్నసైడ్ లుక్ ను షేర్ చేస్తూ ఈ అప్ డేట్ ఇచ్చారు. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న పవన్ కల్యాణ్ మళ్లీ పోలీసాఫీసర్ గా కనిపించనుండటంతో చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
సాగర్ చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా సాయిపల్లవి, రానాకు జోడీగా ఐశ్వర్యరాజేశ్ కనిపించనున్నారు.
Power Storm is all set to takeover with the Title & First Glimpse on 15th Aug from 09:45AM⚡
— BA Raju's Team (@baraju_SuperHit) August 13, 2021
Get ready for the adrenaline rush 🔥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @venupro pic.twitter.com/J34g0Bns9l
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్